మదనపల్లి ముచ్చట్లు:
డీఎస్సీ లో జరిగిన అక్రమాలను సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు
లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న యువత
మదనపల్లి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి
కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నిస్సార్ అహ్మద్ తదితరులు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..
డీఎస్సీ లో అభ్యర్థులకు అన్యాయం జరిగింది
స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు కావలసిన వారికి ఇచ్చుకున్నారు
అది కూడా యూనివర్సిటీ, కాలేజీ స్థాయిలో ఆడిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు
జాతీయ స్థాయిలో ఆడిన వారిని పక్కన పెట్టారు
మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు
మొత్తం 3 లక్షల మంది అభ్యర్థులు హాజరైన పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది
వైఎస్ జగన్ హయాంలో ఏకంగా 1.25 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేపట్టాం
ఇందుకోసం ఏకంగా 26 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు
ఎక్కడ ఒక చిన్న విమర్శకు మేము తావు ఇవ్వలేదు. ఎంతో పకడ్బందీగా ఆ నియామక ప్రక్రియ పూర్తి చేశాం
విద్య రంగం, వైద్య రంగంలో అనేక వేల మందికి ఉద్యోగాలు కల్పించాం
ఈరోజు యువతను, నిరుద్యోగులను, మహిళలను ఈ ప్రభుత్వం మోసం చేసింది
నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి ఎన్నికల్లో గెలిచారు. ఇప్పటికీ ఆ ఊసు లేదు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశ పెట్టి అనేక మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపారు
ఈరోజు అనేక మంది ఇంజనీరింగ్ చదువులు చదువుకుని ఫారిన్ లో సెటిల్ అయ్యారు
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నాడు నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేశారు
ప్రతి పేద విద్యార్థి గొప్పగా ఎదగాలని ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెడితే, దానిని అడ్డుకున్నారు
ప్రభుత్వం మారిన వెంటనే ఇంగ్లీష్ మీడియం ను తీసేశారు
పేదల కోసం దేశం లో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కాలేజీలకు ఏకకాలం లో శ్రీ వైఎస్ జగన్ అనుమతులు తెచ్చారు
వాటిని ప్రవేటీకరించే ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుంది
డీఎస్సీ అక్రమాల పై నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి
డీఎస్సీ గోల్ మాల్ పై చంద్రబాబు సీబీఐ తో విచారణ జరిపించాలి
ఉమ్మడి రాష్ట్రంలో శ్రీ వైఎస్ జగన్ పై సీబీఐ విచారణ కు చంద్రబాబు డిమాండ్ చేస్తే… వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విచారణకు సిద్ధం అన్నారు
కానీ చంద్రబాబు మాత్రం సీబీఐ విచారణకు బయపడుతున్నారు
కూటమి ప్రభుత్వం కు ప్రతిపక్షాల పై కేసులు పెట్టడం లో ఉన్న శ్రద్ధ ప్రజా పాలన పై లేదు
పోలీసులను అడ్డుపెట్టుకుని పాలించే స్థాయికి చంద్రబాబు దిగజారారు.
Tags: A CBI inquiry should be conducted into the irregularities that took place in the DSC.