July 31, 2026
Explore
ఆ దేశం లో మగాళ్లకు ఫుల్ డిమాండ్…

ఆ దేశం లో మగాళ్లకు ఫుల్ డిమాండ్…

July 31, 2026 | Andhra Pradesh

.అద్దెకు భర్తలు కావాలట.ఏం చేయాలో తెలిస్తే అవాక్కే..!

భారత్‌లో ఆడపిల్లలను భారంగా భావించే పరిస్థితులు తరచుగా చూస్తుంటాం.

కానీ యూరప్‌లోని ఆ దేశంలో మాత్రం పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా తయారైంది.

అక్కడ మగవారి జనాభా దారుణంగా పడిపోవడంతో యువతులకు పెళ్లికి అబ్బాయిలు దొరకడం లేదు.

దీంతో అక్కడి ఒంటరి మహిళలు రోజువారీ ఇంటి పనుల కోసం ఏకంగా భర్తలను గంటల చొప్పున ఆన్‌లైన్‌లో అద్దెకు తెచ్చుకుంటున్నారు.

అమరావతిముచ్చట్లు:

ఇంట్లో మగదిక్కు లేకపోవడంతో అక్కడి మహిళలు రోజువారీ పనులు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు పోయినప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్లు చేయడం, ప్లంబింగ్ పనులు, ఫర్నిచర్ మార్చడం, కార్పెంటరీ, ఇల్లు పెయింటింగ్ వేయడం లాంటి బరువైన పనులు ఆడవారు ఒంటరిగా చేసుకోలేరు. సరిగ్గా ఇలాంటి వాణిజ్య అవసరాల కోసమే అక్కడ కొన్ని ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్లు ఇంటర్నెట్‌లో పుట్టుకొచ్చాయి. కోమండా24, రిమాంట్‌దార్బీ లాంటి పాపులర్ వెబ్‌సైట్ల ద్వారా గంటల లెక్కన మగవారిని అద్దెకు బుక్ చేసుకుంటున్నారు. “మెన్ విత్ గోల్డెన్ హాండ్స్” అనే ఆకర్షణీయమైన పేరుతో వీరు స్థానిక మహిళలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. కొత్త టీవీలు గోడకు బిగించడం, పాడైన కుళాయిలు బాగుచేయడం లాంటి పనుల కోసం “హస్బెండ్ ఫర్ ఆన్ అవర్” పేరుతో ఆన్‌లైన్ ద్వారా అద్దెకు పిలుపించుకుంటున్నారు. పని పూర్తయిన తర్వాత వారు కష్టపడిన గంటల చొప్పున వారికి కచ్చితంగా డబ్బులు చెల్లిస్తారు. కేవలం శారీరక శ్రమతో కూడిన ఇంటి పనుల కోసం మాత్రమే కాకుండా ఒంటరితనంతో బాధపడేవారు మానసిక ధైర్యం ఇచ్చే తోడు కోసం ఆన్‌లైన్‌లో భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఇలా ఆన్‌లైన్ ద్వారా మగవారిని అద్దెకు తెచ్చుకోవడం లాత్వియాలోని చాలా నగరాల్లో ఇప్పుడు ఒక సాధారణ ట్రెండ్‌గా మారిపోయింది.

Tags: There is huge demand for men in that country…