గుర్రంకొండ ముచ్చట్లు:
గుర్రంకొండ మండలంలో భార్య తన ప్రియుడుతో కలిసి భర్త పై బండ రాళ్లతో కొట్టి హత్యాయత్నంకు పాల్పడ్డ అమానుష ఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. భార్య చేతిలో తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న బాధితుడు, తంబళ్లపల్లి నియోజకవర్గం లోని కురబలకోట కోటవీధికి చెందిన లారీ డ్రైవర్ రఘునాధ(51)గా గుర్తించిన పోలీసులు 108 లో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags:Wife, along with her lover, struck her husband with large stones.