July 31, 2026
Explore
బర్త్, డెత్ సర్టిఫికెట్లపై కేంద్రం కీలక సవరణ బిల్లు

బర్త్, డెత్ సర్టిఫికెట్లపై కేంద్రం కీలక సవరణ బిల్లు

July 31, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జనన, మరణ నమోదు ఆలస్యమైతే నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ‘ది రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026’ ను ప్రవేశపెట్టింది.

ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత జనన లేదా మరణ నమోదు కోసం దరఖాస్తు చేస్తే, ఇకపై జుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) అనుమతి తప్పనిసరి చేసే ప్రతిపాదనలను బిల్లులో చేర్చారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, సభలో విపక్షాల నిరసనల మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది.

Tags;Centre introduces key amendment bill on birth and death certificates.