March 25, 2026
Explore
రాపూరు – పెంచలకొన మార్గం లో 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

రాపూరు – పెంచలకొన మార్గం లో 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

March 25, 2026 | Andhra Pradesh

రాపూరు ముచ్చట్లు:

  • ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు నెల్లూరు జిల్లా రాపూరు - పెంచల కోన మార్గంలో 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో డీఎస్పీ శ్రీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానందకు చెందిన ఆర్ఎస్ఐ ఎన్ బాల చెన్నయ్య టీమ్ స్థానిక ఎఫ్వీఓ జాన్ రంజిత్ కుమార్ తో కలసి మంగళవారం నుంచి నెల్లూరు జిల్లా రాపూరు మండలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున పెంచలకోన రోడ్డులో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని రాపూరు మండలానికి చెందిన వారి గా గుర్తించారు. వారిని విచారించి, పరిసరాల్లో అక్రమ రవాణాకు సిద్ధంగా 13ఎర్రచందనం దుంగలు కనుగొన్నారు.మరో మోటారు సైకిల్ తో పాటు అరెస్టయిన వారిని ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డీఎస్పీ వీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ జె శ్రీనివాస్ వీరిని విచారించారు. తరువాత ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Tags: 13 Red Sandalwood Logs Seized on Rapur–Penchalakona Route