July 30, 2026
Explore
మానవ అక్రమ రవాణా తీవ్రమైన నేరం

మానవ అక్రమ రవాణా తీవ్రమైన నేరం

July 30, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

సమాజంలోని మానవులను అక్రమ రవాణా చేయడం తీవ్రమైన నేరమని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి పరేష్‌కుమార్‌ తెలిపారు. గురువారం స్థానిక ఎంసివి డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ లైంగికదోపిడి, వెట్టిచాకిరి, బానిసత్వం, సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, పేదరికం లాంటి కారణాలు అక్రమ రవాణాకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. వీటిపై ప్రజలు అవగాహన కలిగి, అరికట్టాలని కోరారు. సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ డిజిటల్‌ అరెస్ట్లు, సైబర్‌నేరాలు, డ్రగ్స్ వినియోగంపై విద్యార్థులు అవగాహన కలిగి , జాగ్రత్త వహించాలన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌, న్యాయవాదులు ఎలినార్‌ ప్రశాంతి, ఎంఏ.నూరి తదితరులు పాల్గొన్నారు.

Tags: Human trafficking is a serious crime.