పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు, వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తున్న ఆహారాన్ని గురువారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరగోపాల్ పరిశీలించారు. ఆహారంలో శుభ్రత, పోషక విలువలు, తల్లులకు అందుతున్న ఆహారం వివరాలను పరిశీలించారు. ఆహారం పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Tags: Inspection of patients’ meals