July 30, 2026
Explore
10వ రోజు కొనసాగిన డాక్యుమెంటు రైటర్ల నిరసన

10వ రోజు కొనసాగిన డాక్యుమెంటు రైటర్ల నిరసన

July 30, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లశాఖను ప్రైవేటీకరణ చేస్తూ 396 జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ డాక్యుమెంటు రైటర్లు నిరసన పదోరోజు కొనసాగింది. గురువారం సంఘనాయకులు రామమూర్తి, త్యాగరాజు ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్షం కారణంగా రిజిస్ట్రేషన్లు స్తంభించిందని, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వానికి కూడ నష్టం వాటిల్లుతోందని, ఈ విషయాలను ప్రభుత్వం గమనించకపోవడం బాధకరమన్నారు. లక్షలాది మంది కుటుంభాలను వీధులు పాలు చేసే జీవోను రద్దు చేయడంలో ప్రభుత్వ నిర్లక్షం బాధకరమన్నారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే డాక్యుమెంటురైటర్లకు ఆత్మహత్యలే శరణ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్‌కుమార్‌, బాబు, చంద్రశేఖర్‌, హరి, ఖలీల్‌, మునిరాజచారి, రవిచంద్రరాజు, జ్యోతి, కుమార్‌, కృష్ణవేణి, నాగరాజు, మురళి, రమణ, గణేష్‌, సాధిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Document writers’ protest continues for the 10th day.