- తిరుపతి ముచ్చట్లు:
- ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు
- ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న కారు, మోటారు సైకిల్ సీజ్
కడప జిల్లా పొద్దుటూరు పరిధిలో కారులో తరలిస్తున్న 7 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు స్మగ్లర్లు ను అరెస్ట్ చేసి, అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును, పైలట్ గా వ్యవహరించిన మోటారు సైకిల్ లను సీజ్ చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో డీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఎస్ఐ సి. వినోద్ కుమార్ టీమ్ కడప జిల్లా బసాపురం వద్ద లోడింగ్ పాయింట్లను తనిఖీ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున ఖాజీపేట సెక్షన్ పత్తూరు అటవీ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో నాగపట్నం వైపు నుంచి ఒక మోటారు సైకిల్, మరో కారు వేగంగా వస్తూ కనిపించాయి. తనిఖీ చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి వాహనాలు అపి దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించిన సిబ్బంది ముగ్గురును పట్టుకోగలిగారు. కారులో చూడగా 7ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబట్టిన వారిని కడప, తిరుపతి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. కారు, మోటారు సైకిల్ తో సహా ముగ్గురు స్మగ్లర్లును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.పట్టుబడిన వారిని డీఎస్పీ వీ.శ్రీనివాసులు రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ విచారించారు. ఈ కేసును సీఐ ఖాదర్ బాషా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Seven red sandalwood logs seized in the Proddatur area.