రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట సబ్‌జైలును కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ సందర్శించారు. జైలు రిజిస్టర్లను పరిశీలించి, ఖైదీలతో మాట్లాడి వారి కేసులు, ఆరోగ్య పరిస్థితి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయం ప్రతి ఖైదీ హక్కు అని, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
న్యాయ సహాయం కోసం 15100 హెల్ప్‌లైన్‌ను వినియోగించాలని, అవసరమైతే రాజంపేట మండల న్యాయ సేవా సమితి లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో జైలు అధికారులు, ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.
Tags: Secretary of the Legal Services Authority spoke with prisoners at the Rajampet sub-jail.