సంబేపల్లి ముచ్చట్లు:
సంబేపల్లి మండలంలోని నారాయణరెడ్డిగారిపల్లి, మద్రివాండ్లపల్లి, ప్రకాష్‌నగర్ కాలనీల్లో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి మంత్రి రాంప్రసాద్ రెడ్డికి రెండు కళ్లలాంటి అంశాలని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో గంగిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మల్లికార్జున నాయుడు, హరిప్రసాద్ యాదవ్, గోవర్ధన్ రెడ్డి, సుకువర్ధన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
Tags: The development of villages is Minister Mandipalli Ramprasad Reddy’s goal.