కలికిరి ముచ్చట్లు:
కలికిరిలో జరగనున్న శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి జాతర ప్రశాంతంగా జరిగేలా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Tags: Tight security arrangements for Yellamma Jatara: SP