లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె, రెడ్డివారిపల్లె, మేడిమాకులగుంత గ్రామాల్లో వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పర్యటించారు. హిందూపురం పరిశీలకుడు రమేష్ కుమార్ రెడ్డి తదితర నాయకులతో కలిసి గ్రామాల్లో ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామస్థులు నాయకులకు ఘన స్వాగతం పలికారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
Tags: YSRCP leaders’ village tour in Lakkireddypalle