July 30, 2026
Explore
జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన వెంకట లోకేష్‌కు జేసీ అభినందనలు

జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన వెంకట లోకేష్‌కు జేసీ అభినందనలు

July 30, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లిలోని కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ‘మై భారత్ నేషన్ ఫస్ట్ ఛాలెంజ్’లో ప్రతిభ కనబరిచిన వీరబల్లికి చెందిన వెంకట లోకేష్‌ను అభినందించారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది పాల్గొనగా, లోకేష్ జాతీయ స్థాయిలో ఐదో స్థానం, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానం సాధించారు.

ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, లోకేష్ సాధించిన విజయం అన్నమయ్య జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. విజేత వెంకట లోకేష్ మాట్లాడుతూ, లక్నోలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ విద్యార్థి వీరబల్లి మండలంలోని వి ఆర్ డి ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థి.

Tags: JC congratulates Venkata Lokesh for showcasing talent at the national level.