March 25, 2026
Explore
108 నిర్వాకం..

108 నిర్వాకం..

March 25, 2026 | Andhra Pradesh

-చావు బ్రతుకుల మధ్య రోగి
-బిపి సాచిరేసన్ బాగుందని, రెఫర్ తీసుకెళ్లడానికి నిరాకరించిన108సిబ్బంది..

మదనపల్లి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం 108 సిబ్బంది నిర్వాకంతో ఎలకల మందు తాగిన ఓ మహిళా రోగికి ప్రాణ సంకటంగా మారింది. మదనపల్లి మండలం, అంకి శెట్టి పల్లె పంచాయతీ, పప్పిరెడ్డిపల్లిలో కాపురం ఉంటున్న శ్రీరాములు భార్య లక్ష్మీదేవి 30, కుటుంబ సమస్యలతో ఎలుకలు మందు తాగి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి బాధితురాలు అనే వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రధమ చికిత్సల అనంతరం ఆమెను తిరుపతి రుయాకు వెళ్లాలని డాక్టర్లు రిఫర్ చేశారు. బాధితురాలి భర్త శ్రీరాములు వెంటనే 108కు ఫోన్ చేసి తన భార్య ఎలకల మందు తాగింది తిరుపతికి తరలించాలని డాక్టర్ల చెప్పారని 108కు విజ్ఞప్తి చేశారు. వాల్మీకిపురం108 సిబ్బంది వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి వచ్చింది. రోగి లక్ష్మీదేవి ని పరీక్షించిన 108 సిబ్బందికి బిపి, షుగర్, సాచిరేషన్ బాగుందని సిబ్బంది 108 ఓఈ కి సమాచారం ఇచ్చారు. ఓయి ఎలకల మందు తాగిన లక్ష్మీదేవిని తరలించడానికి అనుమతి ఇవ్వకపోవడంతో వాల్మీకిపురం 108 సిబ్బంది, రోగిని మదనపల్లి జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలోని వదిలిపెట్టి వాపస్ వెళ్ళిపోయింది. డాక్టర్లు రోగిని తిరుపతికి తీసుకెళ్ల మంటే 108 వాపస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి వెళ్లిపోయారని రోగి భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలకల మందు తాగిన తన భార్య పొరపాటున చనిపోతే108 సిబ్బంది, ఓఈ నే బాద్యులని, కేసు పెడతానని కన్నీటి పర్వంతం అయ్యారు.

Tags: The 108 Fiasco