హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ ప్రాముఖ్యతపై అవగాహన.
- విద్యార్థినులకు స్వీయ రక్షణ (Self Defence)పై సూచనలు.
జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి..
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్., సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ మరియు మహిళల భద్రతపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా, ఈ రోజు (30-07-2026) తిరుపతిలోని టీ.పీ.పీ.ఎం. హైస్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. సంజీవ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించడం, జీబ్రా క్రాసింగ్ ద్వారానే రోడ్లు దాటడం, రహదారులపై అప్రమత్తంగా వ్యవహరించడం, బాధ్యతాయుతమైన రహదారి వినియోగదారులుగా ఉండాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు.
అదేవిధంగా విద్యార్థినులకు స్వీయ రక్షణ (Self Defence) యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా స్పందించడం, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండడం, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండడం, అవసరమైన సందర్భాల్లో వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
- ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్., సుబ్బరాయుడు, మాట్లాడుతూ, “విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ క్రమశిక్షణ, రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. అలాగే మహిళల భద్రత, స్వీయ రక్షణపై అవగాహన ప్రతి విద్యార్థినికి అవసరం. చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని” పిలుపునిచ్చారు.
- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో ట్రాఫిక్ భద్రత, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత మరియు ప్రజా భద్రతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించబడుతూ, ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తోందనీ అన్నారు.
Tags:A special program to raise awareness among students about traffic rules.