9 రోజులుగా స్పందించని ప్రభుత్వంపై ఆగ్రహం
పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లశాఖను ప్రైవేటీకరణ చేస్తూ 396 జీవోను రద్దు చేయాలని 9 రోజులుగా డాక్యుమెంటు రైటర్లు నిరసన చేస్తున్న పట్టించుకోకపోవడంపై వారికి దినాలు జరిపేయండి…ప్రభుత్వానికి తృప్తిగా ఉంటుందంటు డాక్యుమెంటు రైటర్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని డాక్యుమెంటు రైటర్లు 73 మంది 9 రోజులుగా పెన్‌డౌన్ చేసి , ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. ప్రభుత్వ జీవోను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుండ 9 రోజులు గడవడంతో మండిపడుతున్నారు. లక్షలాది మందిని వీధులు పాలు చేస్తారని , తమకు ఆత్మహత్యలే శరణ్యమని డాక్యుమెంటు రైటర్లు , డీటీపి ఆపరేటర్లు, స్టాంప్ వెండార్లు ఆవేదన పడుతున్నారు. ప్రభుత్వం ఆర్‌ఎస్‌కెలకు అప్పగించి, ప్రభుత్వ కార్యాలయాలకు ఉనికి లేకుండ పోతోందని మండిపడ్డారు. ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజలు దోపిడికి గురౌతారని ఆరోపించారు. ప్రభుత్వంలో తమకు కావాల్సిన వారి కోసం జీవోను సృష్టించారని , ఉన్నతాధికారులు సైతం జీవోను సమర్థించడం బాధకరమన్నారు. ఈ నిరసన కార్యక్రమాలు ఈనెల 31 వరకు కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి , జీవోను రద్దు చేయాలని లేకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామమూర్తి, పూలత్యాగరాజు, పవన్‌కుమార్, బాబు, చంద్రశేఖర్, హరి, ఖలీల్, మునిరాజచారి, రవిచంద్రరాజు, జ్యోతి, కుమార్, కృష్ణవేణి, నాగరాజు, మురళి, రమణ, గణేష్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Put an end to the era of document writers.