July 29, 2026
Explore
నేడు, రేపు కర్నూలు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

నేడు, రేపు కర్నూలు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

July 29, 2026 | Andhra Pradesh

ఈరోజు సాయంత్రం ఆదోనిలో కార్యకర్తలతో సమన్వయ సమావేశం

రేపు పత్తికొండ (హోసూరు) లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన

కర్నూలుముచ్చట్లు:

రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలతో పాటు పార్టీ బలోపేతంపై ఆయన సమీక్షలు నిర్వహించనున్నారు.

పర్యాటనలో భాగంగా ఈరోజు (బుధవారం) సాయంత్రం 06.00 గంటల నుంచి రాత్రి 07.30 గంటల వరకు ఆదోని మండలం మండిగిరిలో మంత్రి లోకేష్ పర్యటిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహిస్తారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నారు.

రేపు (గురువారం) మధ్యాహ్నం 01.30 గంటల నుంచి సాయంత్రం 04.00 గంటల వరకు పత్తికొండ నియోజకవర్గంలో మంత్రి పర్యటన కొనసాగనుంది. పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు టాటా, సుజ్లాన్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ సోలార్, విండ్ పవర్ ప్రాజెక్ట్ పనులకు ఆయన భూమిపూజ చేసి, శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.

Tags: Minister Nara Lokesh to tour Kurnool district today and tomorrow.