శ్రీకాకుళం ముచ్చట్లు:
భూవివాదాలు, ఫోర్జరీ పత్రాల సృష్టి కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్ కు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. భూ యజమాని జీవించి ఉండగానే మరణ ధ్రువీకరణపత్రం సృష్టించి, కోట్లాది రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలపై తమ్మినేనితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Tags: Former Speaker Tammineni Sitaram at the police station for questioning.