అమరావతిముచ్చట్లు:
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లు’కు ఆమోదం లభించింది. విపక్షాలు పలు సవరణలు కోరినప్పటికీ.. అవి వీగిపోయాయి. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి బిల్లులో నిబంధనలు రూపొందించామని తెలిపింది. అనంతరం సభ గురువారానికి వాయిదా పడింది.
ఈ బిల్లుపై చర్చలో భాగంగా ఆయా పార్టీల సభ్యులు మాట్లాడిన అనంతరం.. చివరగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటరీ వ్యవహారాలపై రాహుల్కు అవగాహన లేదని, ప్రభుత్వం ఎలా నడుస్తుందో ఆయనకు తెలియదని మండిపడ్డారు.
2024లో యాంటీ పేపర్ లీక్ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 52 ఎఫ్ఎఆర్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. నీట్ (NEET) పేపర్ లీకైన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించిందని, అనుభవాల నుంచి నేర్చుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందనడానికి పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లు నిదర్శనమన్నారు.
Tags: Lok Sabha passes anti-paper leak bill.