సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప ….
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను
నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆగస్టు 6 నుంచి 15 వ తేదీ వరకు
నిర్వహిస్తున్న పాదయాత్రలు, ప్రచార ఆందోళనలు, సెప్టెంబరు 1 న ‘చలో దిల్లీ’ కార్యక్రమాన్ని
జయప్రదం చేయాలని సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి మహేష్ సిపిఐ సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప లు పిలుపునిచ్చారు.స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం నేడు వారు
కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికలను బుధవారం నాడు ఆవిష్కరించారు.ఈ
సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా బీజేపీ
అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం, సుపరిపాలన, మెరుగైన భవిష్యత్ అందిస్తామని
వాగ్దానం చేసిందన్నారు. కానీ నేడు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, భరించలేని
ద్రవ్యోల్బణం, విస్తరిస్తున్న అసమానతలు,బలహీనపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ,
కుచించుకుపోతున్న ప్రజాస్వామ్యం,పెరిగిపోతున్న సామాజిక ఉద్రిక్తతలను
ఎదుర్కొంటోందన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ప్రజలకు చేసింది ఏమీ లేకపోయినా ఇంటింటికి టిడిపి పేరుతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టారని, ఏం సాధించారని ఈ కార్యక్రమం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంటింటికి తిరిగే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిలదీయాలని కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారా లేదా అనేది కూడా ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పేలా ప్రశ్నించాలన్నారు.జిల్లాలో జిల్లాలో హంద్రీనీవా కాలవను విస్తీర్ణ చేసి నీటి సామర్ధ్యాన్ని పెంచాలని గాలేరు నగిరి సోమశిల అడివిపల్లి రిజర్వాయర్ జరకోన శ్రీనివాసపురం రిజర్వాయర్ మదనపల్లె సమర్ స్టోరేజ్ ట్యాంకులకు ఆనకట్ట నిర్మాణ పనులు పూర్తి చేసి నీటి ఎద్దడి నివారించాలి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.ఈ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు,
అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తూ సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 15 వ తేదీ
వరకు నిర్వహించే పాదయాత్రలలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని
కోరారు.సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యం సాంబ శివ నియోజకవర్గ కార్యదర్శి కే మురళి లు మాట్లాడుతూ ధరల పెరుగుదలను తక్షణమే
నియంత్రిం చాలని,విద్య, ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవాలని, పంటలకు కనీసం
మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని,యువతకు ఉద్యోగాలు కల్పించాలని,
మహిళా రిజర్వేషన్ ను తక్షణం అమలు చేయాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని,దళిత, ఆదివాసీలపై అకృత్యాలను, దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.వి.బి.జి రాం జీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ గోడ పత్రిక ఆవిష్కరణలో మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ పట్టణ కార్యదర్శి మాధవ్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ్ మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు జి గంగాధర్ రవి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Make the CPI’s ‘Chalo Delhi’ padayatra a success…