పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు బిఎల్‌ఏలు అందరు తక్షణమే జాగ్రత్తలు తీసుకుని ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని ఉమ్మడి జిల్లాల ఐటివింగ్ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన చౌడేపల్లె, సోమల మండలాల బిఎల్‌ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నూతన ఓటర్ల నమోదును పటిష్టంగా చేపట్టాలని సూచించారు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు , ప్రక్క నియోజకవర్గాలలో ఉండరాదని, అలాంటి వారిని తొలగించాలని సూచించారు. నియోజకవర్గ ఓటర్లు ఇతర ర్ఖా•లు, ఇతర జిల్లాల్లో ఉండకుండ జాబితాలను పరిశీలించాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఒక్క ప్రాంతంలోనే ఓటరుగా నమోదై ఉండాలని, దీనిని ఖచ్చితంగా అమలు చేసి పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Tags: YSRCP BLAs must exercise caution.