పుంగనూరు ముచ్చట్లు:
ప్రకృతి మనకు అందజేసిన వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి కృష్ణవంశి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం మండలంలోని సుగాలిమిట్ట గ్రామంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి కృష్ణవంశి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం చెట్లను నరికివేయడం, అడవులను నాశనం చేయడం కారణంగా మనకు వర్షాలు లేకపోవడం, వాతావరణ పరిస్థితులు తలక్రిందులుగా మారిపోవడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరు చెట్లను కాపాడుతూ ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటడం చేపట్టాలన్నారు. పర్యావరణంలో ఏర్పడుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి మొక్కలను, చెట్లను సంరక్షించి, ప్రకృతి ప్రసాదాన్ని ఆశ్వాదించాలేతప్పా నాశనం చేయరాదని సూచించారు. దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుని మొక్కలు నాటే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉండాలని కోరారు. ఈకార్యక్రమంలో తహశీల్ధార్ రాము, సీఐ సుబ్బరాయుడు, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Protect Nature – Justice Krishna Vamsi