July 28, 2026
Explore
శ్రీ అగస్తీశ్వరస్వామికి కుంభాభిషేకం

శ్రీ అగస్తీశ్వరస్వామికి కుంభాభిషేకం

July 28, 2026 | Andhra Pradesh

పుంగనూరు

మండలంలోని నెక్కుంది కొండలపై వెలసియున్న శ్రీ అగస్తీశ్వరస్వామికి మంగళవారం మహా కుంభాభిషేకం నిర్వహించారు. అర్చకులు గణపతిపూజ చేసి , కుంభాభిషేకాన్ని ప్రారంభించారు. ఏకాదశ రుద్రాభిషేకము, కలిశపూజ, వరుణజపము, హోమంనిర్వహించారు. నవగ్రహారాధన చేసి , పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై అగస్తీశ్వరస్వామికి పూజలు చేశారు.

Tags: Kumbhabhishekam for Sri Agastyeswara Swamy