July 28, 2026
Explore
చెక్కు కేసులో నిందితుడికి 6 నెలలు జైలుశిక్ష

చెక్కు కేసులో నిందితుడికి 6 నెలలు జైలుశిక్ష

July 28, 2026 | Andhra Pradesh

రూ.5.50 లక్షలు జరిమాన
-జరిమాన చెల్లించకపోతే మరో మూడు నెలలు జైలుశిక్ష

పుంగనూరుముచ్చట్లు:

చల్లని చెక్కు ఇచ్చి మోసగించిన కేసులో నిందితుడికి 6 నెలలు జైలుశిక్ష, రూ.5.50 లక్షల జరిమాన విధిస్తూ పుంగనూరు అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కృష్ణవంశి సంచాలనాత్మకతీర్పునిచ్చారు. ఈ తీర్పు చెక్కు బాధితులకు భరోసా కల్పిస్తుండగా నిందితులకు గుండెల్లో రైళ్లు పరుగెత్తున్నాయి. పట్టణానికి చెందిన పి.కేశవరెడ్డి కి మదనపల్లెకి చెందిన కెనరాబ్యాంకు ఉద్యోగి నాగరాజు 2016 సంవత్సరంలో రూ.5 లక్షలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందుకు గాను నాగరాజు తన చెక్కును కేశవరెడ్డికి ఇచ్చి డబ్బులు డ్రా చేసుకోమని సూచించాడు. దీనిపై కేశవరెడ్డి పుంగనూరులోని తన ఖాతాలో చెక్కును డబ్బు వసూలుకు దాఖలు చేశాడు. నాగరాజు చెల్లని చెక్కు ఇవ్వడంతో కేశవరెడ్డి మనస్తాపానికి గురై నాగరాజుపై పుంగనూరు కోర్టులో సీసీనెంబరు: 455/2016 గా కేసు దాఖలు చేశారు. దీనిపై పదేళ్లపాటు కేసు సుధీర్ఘవిచారణ సాగింది. సోమవారం విచారణ ముగియడంతో న్యాయమూర్తి కృష్ణవంశి తీర్పును వెలువరించారు. ఈతీర్పులో నాగరాజు ఇవ్వవలసిన చెక్కు డబ్బు రూ.5 లక్షలతో పాటు జరిమాన క్రింద రూ.5.50 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చారు. అలాగే చెల్లని చెక్కు ఇచ్చి మోసగించినందుకు 6 నెలల జైలుశిక్షను విధించారు. జరిమాన డబ్బు చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు అదనంగా జైలుశిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కాగా ఎన్నడు లేని విధంగా భారీ జరిమానతో కూడిన శిక్షను చెక్కు కేసులో కోర్టు విధించడంపై చెల్లని చెక్కు ఇచ్చిన నిందితులకు తీర్పు మచ్చమటలు పట్టిస్తోంది. చెక్కుదారులు తీర్పును స్వాగతీస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags: Accused sentenced to 6 months in prison in cheque case