March 25, 2026
Explore
తెలుగు రాష్ట్రాల్లో 1,304 వరకట్న మరణాలు

తెలుగు రాష్ట్రాల్లో 1,304 వరకట్న మరణాలు

March 25, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

గత ఐదేళ్లలో ఏపీ, తెలంగాణల్లో 1,304 మంది మహిళలు వరకట్న వేధింపుల వల్ల మరణించారని కేంద్రం లోక్సభలో వెల్లడించింది. ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. 2019 నుంచి 2023 వరకు ఏపీలో 526, తెలంగాణలో 778 వరకట్న మరణాల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో శిక్షల ఖరారు రేటు ఏపీలో 11.5 శాతం, తెలంగాణలో 14.4 శాతంగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 2023లో 6,156 మంది కట్నం వేధింపులతో మరణించగా, యూపీ, బీహార్ రాష్ట్రాలు టాప్లో నిలిచాయి.

Tags: 1,304 Dowry Deaths in the Telugu States