, పరిశోధన ప్రకారం ఏం తినాలో తెలుసా?
అమరావతిముచ్చట్లు:
నేటి బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల ముప్పు పెరుగుతుంది. అయితే, కొన్ని లైఫ్‌స్టైల్ మార్పులతో పాటు సరైన ఆహారం తీసుకుంటే కొలెస్ట్రాల్ ముప్పు తగ్గుతుంది. లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఒక పండు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయని పరిశోధకులు కనుగొన్నారు.
ఈ రోజుల్లో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాల ముప్పు పెరుగుతుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలి. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడం తినే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిశోధనలు వెల్లడించిన వివరాల ప్రకారం శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ప్రతిరోజూ తినాల్సిన ఆ ఏకైక పండు అవకాడో. జర్నల్ ఆఫ్ క్లినికల్ లిపిడాలజీ (Journal of Clinical Lipidology) లో ప్రచురితమైన ‘హాబిచువల్ డైట్ అండ్ అవకాడో ట్రయల్’ అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ ఒక ఆవకాడో తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) ప్రమాదకర స్థాయిలు తగ్గుతాయని తేలింది.
రీసెర్చ్ ఎలా జరిగింది?
రీసెర్చ్ ఎలా జరిగింది?
అధిక బరువు ఉన్నవారిపై 6 నెలల పాటు నిర్వహించిన ఈ పరిశోధనలో, సాధారణ ఆహారం తిన్నవారితో పోలిస్తే రోజూ అవకాడో తిన్నవారి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కణాలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. ఈ రీసెర్చ్‌లో అధిక బరువు ఉన్నవారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు ఆరు నెలల పాటు ప్రతిరోజూ ఒక అవకాడోను తినగా, రెండో గ్రూపు వారి సాధారణ ఆహారాన్ని కొనసాగించింది. అధ్యయనం ముగింపులో ప్రతిరోజూ అవకాడో తిన్నవారి రక్తంలో LDL కణాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ఎందుకు ముఖ్యం?
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ఎందుకు ముఖ్యం?
రక్తంలో ఉండే ఎల్‌డిఎల్‌ను చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది రక్తనాళాల గోడల్లో పేరుకుపోయి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీనివల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అన్ని చెడు కొలెస్ట్రాల్ కణాలు ఒకేలా ఉండవు. వీటిలో చిన్నవిగా, సాంద్రత ఎక్కువగా ఉండే LDL కణాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి రక్తనాళాల్లో సులువుగా చొరబడి వాపును, హానిని కలిగిస్తాయి. అవకాడోను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ప్రత్యేకించి ఈ ప్రమాదకరమైన చిన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
అసలు అవకాడోలో ఏముంది? గుండెకు ఎలా మేలు చేస్తుంది?
అసలు అవకాడోలో ఏముంది? గుండెకు ఎలా మేలు చేస్తుంది?
మంచి కొవ్వులు: శరీరంలో హానికరమైన సంతృప్త కొవ్వుల స్థానంలో ఇవి చేరి చెడు కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తాయి.
డైటరీ ఫైబర్: జీర్ణ వ్యవస్థలో కొలెస్ట్రాల్ పీల్చుకోవడాన్ని తగ్గిస్తుంది.
పొటాషియం, ఫోలేట్: పొటాషియం బీపీ (రక్తపోటు)ని అదుపులో ఉంచుతుంది.
విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్లు: ఇవి రక్తనాళాల్లో వాపు కలగకుండా కాపాడతాయి.
బరువు తగ్గకపోయినా మేలు జరుగుతుంది!
ఈ పరిశోధనలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఆరు నెలల పాటు అవకాడో తిన్నవారిలో బరువు లేదా నడుము కొలతల్లో పెద్దగా మార్పు రాకపోయినా, వారి రక్తంలో ప్రమాదకర చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయి. అంటే కఠినమైన డైటింగ్ చేయకుండా, సాధారణ ఆహారానికి ఒక అవకాడోను జత చేసినా గుండె ఆరోగ్యానికి మంచి ఫలితాలు వస్తాయని అర్థమవుతోంది.
అవకాడోను ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?
వీటిని సలాడ్స్, శాండ్‌విచ్‌లలో ముక్కలుగా కోసి తీసుకోవచ్చు.
వెన్న లేదా ప్రాసెస్ చేసిన స్ప్రెడ్స్ బదులుగా అవకాడో గుజ్జును బ్రెడ్ టోస్ట్ లేదా వ్రాప్స్‌పై రాసుకుని తినవచ్చు.
స్మూతీస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
కేలరీల పట్ల జాగ్రత్త: అవకాడోలో పోషకాలతో పాటు కేలరీలు కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి బరువు పెరగకుండా ఉండాలంటే.. మీ డైట్‌లో వెన్న, నెయ్యి లేదా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ తగ్గించి, ఆ స్థానంలో అవకాడోను చేర్చుకోవడం మంచిది.
చివరగా: కేవలం ఒక పండు మాత్రమే గుండె జబ్బులను పూర్తిగా నివారించలేదు. దీనితో పాటు రోజువారీ వ్యాయామం, సరైన నిద్ర, పొగత్రాగే అలవాటుకు దూరంగా ఉండటం, పండ్లు, కూరగాయలు, ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం
Tags: The only fruit you should eat every day to lower high cholesterol levels in the body.