పుంగనూరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అయుబ్ భాష ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులు సాధించిన విజయానికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా అయుబ్ భాష మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై గత కొన్ని నెలలుగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ఫలితంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం విద్యార్థుల పోరాట విజయానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సజాద్ బాషా, బాబా , తదితరలు పాల్గొన్నారు.
Tags: Candlelight rally led by the Congress party…