హిందూపురం ముచ్చట్లు:
బ్రాహ్మణ సమాజ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని బ్రాహ్మణసంఘం సేవా పరివార్ సోసైటి సంఘం సభ్యులు తెలిపారు. శనివారం లక్ష్మీపురంలోని సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, నూతనంగా ఎన్నికైన కమిటి సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘ సభ్యుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అలాగే పేద బ్రాహ్మణ విద్యార్థులకు విద్య, ఉద్యోగ కల్పనకు సంఘం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. సంఘానికి సంబంధించిన 30 సెంట్ల స్థలంలో త్వరలో వృద్ధాశ్రమం నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. పట్టణంలోని శ్రీగాయిత్రిదేవాలయం, శ్రీభదానిశంకరమఠం, బ్రాహ్మణసేవా ట్రస్ట్ , రుద్రభూమి కమిటి సభ్యులకు తోడ్పాటునందిస్తామన్నారు. అనంతరం నూతన కమిటి సభ్యులను బ్రాహ్మణ పెద్దలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Tags: Efforts for the development of Brahmins