July 25, 2026
Explore
జీవో 396 రద్దు చేయాలని పీలేరులో నిరసన

జీవో 396 రద్దు చేయాలని పీలేరులో నిరసన

July 25, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరు పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట జీవో నెం.396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టాంప్ వెండర్లు, దస్తావేజు లేఖరులు, డీటీపీ ఆపరేటర్లు శనివారం నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. జీవో 396 అమలుతో స్టాంప్ వెండర్లు, లేఖరులు, డీటీపీ ఆపరేటర్ల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో పెద్ద సంఖ్యలో స్టాంప్ విక్రేతలు, లేఖరులు, డీటీపీ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Tags: Protest in Pileru to repeal GO 396