July 25, 2026
Explore
కుంభాభిషేక మహోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

కుంభాభిషేక మహోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

July 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని శ్రీమాణిక్యవరదరాజస్వామి ఆలయంలో రాజగోపుర మహా కుంభాభిషేక మహోత్సవాల కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. దేవదాయశాఖ ఉప కమిషనర్‌ ఏకాంబరం, ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు ఆలయ ఆవరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకాంబరం మాట్లాడుతూ ఆగస్టు 14నుంచి 17 వతేదీ వరకు నాలుగు రోజుల పాటు మహాకుంభాభిషేక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Tags: Unveiling of brochures for the Kumbhabhishekam festival