శేషాచలం ముచ్చట్లు:
- రూ. 1.5కోట్ల విలువైన 78ఎర్రచందనం దుంగలు స్వాధీనం
- ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లుతో పాటు ముగ్గురు అరెస్టు
- ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టడం కోసం టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్.
- శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనం దొంగలను కర్ణాటక, హర్యానా, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్న ప్రధాన స్మగ్లింగ్ నెట్‌వర్క్ ను ఛేదించిన టాస్క్ ఫోర్స్
- అరెస్టు అయిన వారిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడు
- గృహోపకరణాల రవాణా ముసుగులో ఎర్రచందనం స్మగ్లింగ్
- బొలెరో వాహనం స్వాధీనం
- ఎర్రచందనం అక్రమ రవాణా ని అరికట్టడం కోసం మున్ముందు మరింత కఠిన చర్యలు, తప్పు చేసిన వారిని ఎవరిని ఉపేక్షించేది లేదు.
- ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన టాస్క్ ఫోర్స్ బృందాన్ని అభినందించిన టాస్క్ ఫోర్స్ హెడ్ యల్. సుబ్బరాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో, ఎర్ర చందన అక్రమ రవాణా నిరోధక దళం (RSASTF) హెడ్ SP L.సుబ్బారాయుడు, మార్గదర్శకత్వంలో, RSASTF S.P. . P. శ్రీనివాస్ IPS మరియు RSASTF Addl. SP J. కులశేఖర్ ఆధ్వర్యం లో శేషాచల అడవులలో ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆపరేషన్ లు నిర్వహించడం తో పాటు, ఎర్ర చందనం కేసు లలో ముద్దాయిలు గా ఉంటూ తప్పించుకొని తిరుగుతున్న అంతర రాష్ట్ర స్మగ్లర్లను చట్టం ముందు నిలబెట్టడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ రోజు అనగా 25.07.2026 వ తేదీ తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ మరియు స్టేట్ ఇంటలిజెన్స్ బృందం అటవీ సిబ్బంది కి రాబడిన ఖచ్చితమైన సమాచారంతో కడప జిల్లా, అవదూత కాశినాయన మండలం లోని జ్యోతి గుడి – వరికుంట వరికుంట్ల గ్రామము సమీపమున వాహనములు తనిఖీ చేస్తూ ఉండగా Bolero MAXI Turck (Container) వాహనము లో ఇంటి సామాన్లు తరలించే ముసుగులో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తూ ఉండిన హర్యానా రాష్ట్రానికి చెందిన సన్నీ మరియు రమేశ్ అను ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని వారి నుండి సుమారు 1.5 కోట్ల రూపాయల విలువ గల ఒక బోలోరో Maxi వాహనం తో సహా 78 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
విచారణలో భాగంగా జ్యోతి ఫారెస్ట్ బీట్ లో పని చేస్తున్న F.B.O మల్లికార్జునుడు ఈ ఎర్ర చందనం అక్రమ రవాణా లో ప్రధాన ఎర్ర చందనం స్మగ్లర్లకు సహకరిస్తునట్లు గుర్తించి సదరు FBO మల్లికార్జునుడు ను అదుపులోకి తీసుకోవడం జరిగినది. ఈ స్మగ్లింగ్ కార్యకలాపాల ద్వారా లో బెంగళూరు, హర్యానా, కలకత్తా లోని కొంత మంది ప్రధాన సూత్రధారుల పాత్ర ని గుర్తించడం జరిగింది, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి త్వరలో వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది.
ఎర్ర చందనం దుంగలు మరియు వాహనం ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అంతర రాష్ట్ర స్మగ్లర్ ను అరెస్ట్ చేసి, తద్వారా వారికి సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడు ని అరెస్ట్ చేయడం లో కీలక పాత్ర పోషించిన టాస్క్ ఫోర్స్ బృందాన్ని అభినందించడమైనది.
అరెస్ట్ కాబడిన ముద్దాయిలు:
- సన్నీ,వయస్సు: 28 సం., తండ్రి: నరేష్ కుమార్, మట దర్వాజా స్ట్రీట్, రోహతక్ టౌన్ మరియు జిల్లా హర్యానా రాష్ట్రం.
- రమేష్, వయస్సు: 33 సం., తండ్రి మంగల్, బలాబ్ 112, గడ్డి పోస్ట్, రోహతక్ టౌన్ మరియు జిల్లా హర్యానా రాష్ట్రం
- మల్లికార్జునుడు, వయసు 54 సం,, తండ్రి రాముడు, వృత్తి: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జ్యోతి ఫారెస్ట్ బీట్ ఏరియా.
Tags:Red Sanders Anti-Smuggling Task Force