March 25, 2026
Explore
భార్యపై కోపంతో రెండేళ్ల కూతురుని కడతేర్చిన తండ్రి

భార్యపై కోపంతో రెండేళ్ల కూతురుని కడతేర్చిన తండ్రి

March 25, 2026 | Andhra Pradesh

యాదాద్రి ముచ్చట్లు:

సపోటా పండులో ఎలుకల మందు కలిపి హత్య, అనంతరం తాను ఆత్మహత్యాయత్నం

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లక్హమ్మగూడెంలో తమ కూతుళ్లు మేఘన(2), మయూరి(9 నెలల)తో నివసిస్తున్న రవి, స్వాతి అనే దంపతులు

భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా, మూడు నెలల క్రితం చిన్న కూతురిని తీసుకుని స్వాతి పుట్టింటికి వెళ్లగా, తండ్రితో ఉంటున్న పెద్ద కూతురు

పెద్ద కూతురుని కూడా తన వద్దకే పంపాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా, పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపిన దంపతులు, వారి కుటుంబ సభ్యులు

పరువు పోయిందనే కోపం, కూతురు దూరం అవుతుందనే బాధలో, తన పెద్ద కూతురుకి సపోటా పండులో ఎలుకుల మందు కలిపి ఇచ్చి, తాను కూడా ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రవి

గమనించిన కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి, రవి పరిస్థితి విషమం

భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Tags: Father Kills Two-Year-Old Daughter Out of Anger Towards Wife