July 25, 2026
Explore
ఏకలవ్య మహారాజ్ జయంతి ఉత్సవము

ఏకలవ్య మహారాజ్ జయంతి ఉత్సవము

July 25, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు:


శనివారం అనంతపురం పట్టణం లోని పాతూరు గిరిజన భవనంలో ఏకలవ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు పి వెంకటప్ప హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన సంఘ నాయకులతో కలిసి నాయకులతో కులస్తులు ఏకలవ్యుని చిత్ర పటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అలాగే కేక్ కటింగ్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గర్మా మల్లికార్జున నాయక్ మరియు గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం ఎం.శివ శంకర్ నాయక్ లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏకలవ్య జయంతి నీ అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, రాష్ట్రంలో గిరిజనులకు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారే తప్ప గిరిజనులు అభివృద్ధి గాని గిరిజనుల సంక్షేమం గాని వారికి రావలసినటువంటి రాజకీయ హక్కులైతేనేమి వీటిని అన్నిటిని గాలికి వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని గిరిజన సంఘాల నాయకులు మాట్లాడారు. ఇప్పటికైనా గిరిజన జాతి కోసం పోరాటం చేసిన నాయకులు వారి జయంతి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు మహిళలు విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున కలిసి విజయవంతం చేశారు.

Tags:Ekalavya Maharaj Jayanti Celebrations