July 25, 2026
Explore
ఏందీరా సామి..! అది బైక్ అనుకున్నారా? మినీ బస్..? ఒకే బైక్‌పై ఆరుగురు.. కట్ చేస్తే..!

ఏందీరా సామి..! అది బైక్ అనుకున్నారా? మినీ బస్..? ఒకే బైక్‌పై ఆరుగురు.. కట్ చేస్తే..!

July 25, 2026 | Andhra Pradesh

శ్రీసత్యసాయి జిల్లా ముచ్చట్లు:

శ్రీసత్యసాయి జిల్లాలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే మోటార్‌సైకిల్‌పై ఆరుగురు ప్రయాణిస్తూ రోడ్లపై వెళ్తుండగా హిందూపురం రూరల్ పోలీసులు గుర్తించి వెంటపడి పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చివరికి పోలీసులు బైక్‌ను చేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

శ్రీసత్యసాయి జిల్లాలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే మోటార్‌సైకిల్‌పై ఆరుగురు ప్రయాణిస్తూ రోడ్లపై వెళ్తుండగా హిందూపురం రూరల్ పోలీసులు గుర్తించి వెంటపడి పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఒకే బైక్‌పై ఆరుగురు యువకులు ప్రయాణిస్తుండటం ఆయన కంట పడింది. పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా వారు ముందుకు వెళ్లడంతో వెంటనే బైక్‌ను చేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా, వారు బీహార్‌కు చెందిన వలస కార్మికులని పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఒకే ద్విచక్ర వాహనంపై ఆరుగురు ప్రయాణించడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రయాణం వల్ల చిన్న ప్రమాదం జరిగినా ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

పోలీసులు మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల కోసం ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. అలాగే బైక్‌పై ప్రయాణిస్తున్న ఆరుగురినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సిలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదకర ప్రయాణాలు చేయొద్దని, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని, ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు స్పష్టం చేశారు.

Tags;Good heavens! Did you mistake that for a bike? Or a mini-bus? Six people on a single bike… and then—!