July 25, 2026
Explore
మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఏసీబీ కేసులో శాఖాపరమైన విచారణ

మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఏసీబీ కేసులో శాఖాపరమైన విచారణ

July 25, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 2020లో నమోదైన ఏసీబీ కేసుకు సంబంధించి శాఖాపరమైన విచారణ శుక్రవారం నిర్వహించారు. విచారణ అధికారి, తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ శ్రీరామ్ కుమార్, ఏసీబీ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో కార్యాలయ ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లు, వెండర్ల నుంచి వేర్వేరుగా వాంగ్మూలాలు నమోదు చేశారు.

2020 జనవరిలో రిజిస్ట్రేషన్ల కోసం అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి అప్పటి సబ్‌రిజిస్ట్రార్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. ఆ సమయంలో నగదు స్వాధీనం చేసుకుని సంబంధిత వారిని విచారించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

ఈ కేసులో భాగంగా ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించగా, శుక్రవారం స్థానిక కురవంకలోని డీఆర్ కార్యాలయంలో కేసులో నమోదైన 15 మందిని విచారించి వారి స్టేట్‌మెంట్‌లు నమోదు చేశారు. గత వారం జరగాల్సిన విచారణ వాయిదా పడగా, శుక్రవారం విచారణ ప్రక్రియ పూర్తయింది.

Tags:Departmental inquiry into the ACB case involving the Madanapalle Sub-Registrar’s office.