పీలేరుముచ్చట్లు:
పీలేరు నియోజకవర్గంలో మొత్తం 2,36,532 ఓట్లు నమోదయ్యాయి. వీటిలో 2,07,965 ఓట్లు డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. 5,743 ఓట్లు 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాలేదు. అలాగే మరణం, ద్వంద్వ ఓట్లు, ఎన్యుమరేషన్ ఫారం సమర్పించకపోవడం, చిరునామా గుర్తించలేకపోవడం తదితర కారణాలతో 28,567 ఓట్లు అన్‌కలెక్టబుల్ జాబితాలో నమోదయ్యాయి. మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేయనుండగా, ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాలు సమర్పిస్తే వారి ఓటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Tags;28,567 uncollectible votes in Pileru constituency.