July 25, 2026
Explore
రాయచోటి నియోజకవర్గంలో 14,417 ఓట్లు మ్యాపింగ్ కాలేదు

రాయచోటి నియోజకవర్గంలో 14,417 ఓట్లు మ్యాపింగ్ కాలేదు

July 25, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం ముగియడంతో రాయచోటి నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. నియోజకవర్గంలో మొత్తం 2,58,163 ఓట్లు ఉండగా, వాటిలో 2,25,704 ఓట్లు డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. 14,417 ఓట్లు 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాలేదు. అలాగే మరణం, ద్వంద్వ ఓట్లు, ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించకపోవడం, చిరునామా గుర్తించలేకపోవడం వంటి కారణాలతో 32,459 ఓట్లు ‘అన్‌కలెక్టబుల్’ జాబితాలో నమోదయ్యాయి.

మ్యాపింగ్ కాని ఓటర్లకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాలు సమర్పిస్తే వారి ఓటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అన్‌కలెక్టబుల్ జాబితాలో ఉన్న ఓట్లపై పరిశీలన అనంతరం ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తుది నిర్ణయం తీసుకోనుంది.

Tags:14,417 votes in the Rayachoti constituency have not been mapped.