July 24, 2026
Explore
సింహవాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీ సౌమ్యనాథస్వామి

సింహవాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీ సౌమ్యనాథస్వామి

July 24, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

నందలూరు బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం

నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం రాత్రి స్వామివారు యోగ నరసింహ స్వరూపంలో సింహవాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అనుగ్రహించారు.

దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీకగా స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించారు. అజ్ఞానం, అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని పరిరక్షించడంలో తాను, తన వాహనమైన సింహం సమానంగా కృషి చేస్తామనే సందేశాన్ని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అందించారు.

జూలై 25న కల్పవృక్ష, హనుమంత వాహనసేవలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూలై 25న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనంపై శ్రీ సౌమ్యనాథస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ వాహనసేవలో టీటీడీ జేఈవో డా. ఏ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో ఎ. ప్రశాంతి, ఈఈ సుమతి, ఏఈవో రవి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags:Sri Saumyanatha Swamy bestowing blessings upon devotees while mounted on the Lion Vahana.