పుంగనూరుముచ్చట్లు:
విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతగానో శ్రమిస్తున్నారని , వారి ఆశయాలను నేరవేర్చాలని అన్నమయ్య జిల్లా డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని బండ్లపల్లెలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని బసవరాజ కళాశాలలో ఎంఈవో నటరాజారెడ్డి, జెడ్పి బాలికోన్నత పాఠశాలలో హెచ్‌ఎం రుద్రాణి, మున్సిపల్ హైస్కూల్ కొత్తయిండ్లలో హెచ్‌ఎం ఉషారాణి, గూడూరుపల్లె హైస్కూల్‌లో హెచ్‌ఎం మహేష్‌నారాయణ ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణం, మండలంలోని 137 పాఠశాలలో మెగా పేరెంట్స్ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో చదవాలని ఆక్షాంక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించేలా ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశాలలో ఎంఈవో రెడ్డెన్నశెట్టి, తహశీల్ధార్ రాము, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Tags: One must fulfill one’s parents’ aspirations.