July 24, 2026
Explore
ఆలయ నిర్మాణానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి లక్షరూపాయలు విరాళం

ఆలయ నిర్మాణానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి లక్షరూపాయలు విరాళం

July 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని ఈడిగపల్లె వద్ద గ్రామస్తులు కలసి నూతనంగా నిర్మిస్తున్న శ్రీ చంద్రమౌలీశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్షరూపాయలు విరాళం ఇచ్చారు. శుక్రవారం మాజీ ఎంపిపి నరసింహులు, మండల పార్టీ అధ్యక్షుడు అమరనాథరెడ్డి , ఎంపిటిసి రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి లు కలసి ఆలయ కమిటి వారికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కమిటి సభ్యులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: Former Minister Peddireddy donates one lakh rupees for temple construction.