పార్టీ ఆదేశాలతో అంతర్ మదనంలో నేతలు
పుంగనూరుముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ అంతర్గత విబేధాలతో శుక్రవారం ఇన్‌చార్జ్ చల్లారామచంద్రారెడ్డి , వ్యాపారవేత్త మధుసూదన్‌నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోటీ సమావేశాలను పార్టీ ఆదేశాల మేరకు రద్దు చేశారు. కాగా తెలుగుదేశం పార్టీ సమావేశాలు పోటాపోటీగా నిర్వహిస్తుండటంపై పట్టణ ప్రజల్లో , పార్టీ క్యాడర్‌లో అలజడ నెలకొంది. సమావేశాలు జరుగుతుందనే అనుమానంతో సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో జెడ్పి అతిధి గృహంలో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. కానీ సమావేశాలు రద్దు కావడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.
Tags; Rival meetings of the ‘Thammullu’ cancelled.