పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని ఈడిగపల్లె వద్ద గల జ్యూస్ ఫ్యాక్టరీ సమీపంలో అక్కదేవతల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని శుక్రవారం గ్రామస్తులు భక్తిశ్రద్దలతో నిర్వహించారు. మట్టికుండలతో తయారు చేసిన అక్కదేవతల విగ్రహాలకు యువకులు పూజలు చేసి మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు సకాలంలో కురిసి , పంటలు పండాలని , గ్రామాలు అభివృద్ధి చెందాలని అక్కదేవతలకు పూజలు చేసి వెహోక్కులు చేసుకున్నారు. ప్రతి యేటా గ్రామాల్లో అక్కదేవతలకు ప్రత్యేకమైన పూజలు చేయడం ఆనవాయితీ.
Tags: Consecration of the Sister Deities