July 24, 2026
Explore
డాక్యుమెంటు రైటర్లు సమ్మె విరమణ

డాక్యుమెంటు రైటర్లు సమ్మె విరమణ

July 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని డాక్యుమెంటు రైటర్లు సమ్మెను విరమించినట్లు సంఘ నాయకులు పూలత్యాగరాజు, బాబుస్వామి తెలిపారు. శుక్రవారం పట్టణంలో సభ్యులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నాయకత్వం, ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించినట్లు వారు తెలిపారు. కార్యాలయాల్లో యదావిధిగా సేవలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పవన్‌కుమార్‌, ఖలీల్‌, మునిరాజచారి, రవిచంద్రరాజు, జ్యోతి, చంద్రశేఖర్‌, హరి, కుమార్‌, కృష్ణవేణి, నాగరాజు, మురళి, రమణ, గణేష్‌, సాధిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Document writers call off strike.