రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి చిరుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉక్కపోత నుంచి ప్రజలకు కొంచం ఉపశమనం లభించింది. వ్యాపారులు, పాదచారులు వర్షం నుంచి రక్షణ కోసం సమీపంలోని దుకాణాలు, భవనాల్లో ఆశ్రయం పొందారు. రైతులు మాత్రం ఈ వర్షం పంటలకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags: Rain accompanied by light winds in Rayachoti.