July 24, 2026
Explore
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్: చమర్తి

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్: చమర్తి

July 24, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేటలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజా దర్బార్‌లో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని, లేనిపక్షంలో సమస్యపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు. ప్రతి వినతిపై అధికారులతో సమీక్షించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Tags: ‘Praja Darbar’ is for resolving public issues: Chamarthi