July 24, 2026
Explore
మెగా పీటీఎం 4.0లో పాల్గొన్న కలెక్టర్ నిశాంత్ కుమార్

మెగా పీటీఎం 4.0లో పాల్గొన్న కలెక్టర్ నిశాంత్ కుమార్

July 24, 2026 | Andhra Pradesh

పెద్దమండ్యం ముచ్చట్లు:

పెద్దమండ్యం మండలం కలిచెర్ల జెడ్పీ తెలుగు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్స్ మీట్ (పీటీఎం) 4.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల ప్రాముఖ్యతను వివరించి, ప్రతి విద్యార్థి అభ్యాస పురోగతిని తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల సమన్వయంతో విద్యా నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు. పాఠశాల అభివృద్ధిపై తల్లిదండ్రుల సూచనలు స్వీకరించారు. అనంతరం ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

Tags: Collector Nishant Kumar participated in Mega PTM 4.0.