July 24, 2026
Explore
సుండుపల్లిలో మెగా పేరెంట్–టీచర్స్ సమావేశం

సుండుపల్లిలో మెగా పేరెంట్–టీచర్స్ సమావేశం

July 24, 2026 | Andhra Pradesh

సుండుపల్లి ముచ్చట్లు:

సుండుపల్లి మండల కేంద్రంలోని జీకే రాచపల్లి ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకుడు మహేష్ నాయుడు, ఎమ్మార్వో వేణుగోపాల్, ఎంఈఓ రవీంద్ర నాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరమని అన్నారు. పిల్లల చదువుపై నిరంతరం పర్యవేక్షణతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ అలవర్చాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని చదువులో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు.

అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం అతిథులను ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: Mega Parent-Teacher Meeting in Sundupalli