July 24, 2026
Explore
నీట్ పేపర్ లీకేజ్ నిరసనలో విద్యాసంస్థల బంద్

నీట్ పేపర్ లీకేజ్ నిరసనలో విద్యాసంస్థల బంద్

July 24, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

నీట్ పేపర్ లీకేజ్ ఘటనతో పాటు ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్త బంద్‌లో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌పీ, ఏపీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో పారదర్శకతను కాపాడాలని, విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిరణ్, లోకేష్‌తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags: Educational institutions shut down in protest against NEET paper leak.