పీలేరు ముచ్చట్లు:
పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గుర్రంకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.13,000 చొప్పున తల్లుల ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, యూనిఫాంలు, కిట్లు పంపిణీ చేసి వారితో కలిసి భోజనం చేశారు. విద్యతో ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు.
Tags: ‘Thalliki Vandanam’ supports students’ future: MLA